పలమనేరు:మార్కెట్ కమిటీ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రి పనిచేసిన కీర్తిశేషులు వైయస్ఆర్ ప్రజలకు ఎన్నో లబ్ధి చేకూర్చే పథకాలను అందజేశారు. అందులో ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ డబ్బులు ఉన్న లేకపోయినా ప్రతి పేదవారికి చికిత్సలు ఉచితంగా లభించాయన్నారు. ఇలా ఎన్నో ప్రజారంజకమైన పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో దేవుడు లాగా కొలువయ్యారన్నారు.