కడప సెంట్రల్ జైలు సమీపంలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి ఓ ఎలక్ట్రికల్ బస్సు కడపకు బయల్దేరింది. జైలు సమీపంలో ఎదురుగా వచ్చిన బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు శంకరాపురానికి చెందిన నవన్(22), చరణ్(20)గా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.