బొగ్గు రవాణా చేస్తున్న లారీలను నియంత్రించి కాలుష్యాన్ని అరికట్టాలని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. శుక్రవారం లంకెలపాలెం జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. నిబంధనలను అతిక్రమించి పరిమితికి మించిన బరువుతో లారీలు బొగ్గును రవాణా చేస్తున్నాయన్నారు. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.