పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో బుధవారం భారీ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో రహదారులు నీటమునిగిపోగా, విద్యుత్ సరఫరా కూడా కొన్నిచోట్ల నిలిచిపోయింది. వర్షం ఆగకపోతే లోతట్టు ప్రాంతాలు మరింత మునిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి అని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు హెచ్చరించారు. వీరవాసరంలో భారీ వర్షం కురిసింది.