వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆయా ప్రాంతాలను సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. వినాయకులను నిమజ్జనం చేసిన ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువు, నందిపేట మండలం ఉమ్మెడ, నవీపేట్ మండలం యంచ గోదావరి బ్రిడ్జి తదితర ప్రాంతాలను కలెక్టర్ సందర్శించి, వినాయక విగ్రహాల నిమజ్జనం తీరుతెన్నులను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఏ చిన్న ప్రమాదానికి సైతం ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. విగ్రహాల నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.