నిర్మల్ జిల్లాలో మంజూరైన ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నిరుద్యోగులు శనివారం జిల్లా కేంద్రంలో బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 13 ప్రీ ప్రైమరీ పోస్టులు మంజూరైనట్లు నిరుద్యోగులు తెలిపారు. అర్హత కలిగినవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.