పాడేరు మండలంలోని వంట్లమామిడి గ్రామంలో అల్లూరి జిల్లా, అనకాపల్లి జిల్లా ఏసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరిపిన దాడుల్లో 40 లీటర్ల నాటుసారాతో నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. శనివారం అధికారులు దాడులు చేయగా, రెండు ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న నాటుసారాతో రాము, బాలరాజు, రాము, మత్స్యరాజు అనే నలుగురిని అరెస్టు చేశారు. నాటుసారాను, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ ఆచారి తెలిపారు.