ఆత్మకూరు నియోజకవర్గంతో పాటు పాములపాడు,కొత్తపల్లి మండలాల్లో యూరియా మాఫియా జరుగుతుందని రైతులకు అందాల్సిన యూరియాను పక్కదారి పట్టిస్తూ 270 రూపాయలు అమ్మాల్సిన బస్తా 600 రూపాయలు రైతులకు విక్రయిస్తూ ధనార్జనే ధ్యేయంగా ప్రవేటు దుకాణ దారులు మోసం చేస్తున్నారని తక్షణమే ప్రత్యేక విజిలెన్స్ అధికారులచే దర్యాప్తు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు ఆత్మకూరు తాలూకా కార్యదర్శి టి.ప్రతాప్ లు డిమాండ్ చేశారు.. యూరియా మాఫియ అరికట్టాలని కోరుతూ మంగళవారం ఇంచార్జి ఏ డి ఏ హేమలత కు వినతిపత్రం అందించారు.