నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని తాహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) అమర్ నాథ్ రెడ్డి, సోమవారం ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక రైతుకు సంబంధించి పట్టాదారు పాస్ బుక్ లో తండ్రి పేరు చేర్చేందుకు రూ.5,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఆరిని అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.