రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ చౌరస్తా వద్ద అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ చౌరస్తా వద్ద ఉదయం ఆరు గంటలకు పెట్రోలింగ్ సమయంలో ఎదురుగా ఇసుకలోడుతో ట్రాక్టర్ వచ్చింది. ఆ ట్రాక్టర్ కు ఎలాంటి ఇసుక అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ పై ఎస్సై రాహుల్ రెడ్డి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్