దేవరకద్ర నియోజకవర్గం భూత్ పూర్ మండల కేంద్రంలో మంగళవారం యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రూ.1500 కూలీ పెట్టి నాట్లు వేసినా, యూరియా దొరకకపోతే పంట ఎలా పెరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది.