మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ గ్రామ శివారులో పెట్రోల్ పంపు వద్ద విద్యుత్ షాక్ తగిలి ఆవు నూరి లింగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.మరొకరికి గాయాలు అయ్యాయి . స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళితే గుల్లకోట గ్రామానికి చెందిన ఆవునూరు లింగయ్య అనే వ్యక్తి పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఫంక్షన్ హాల్లో పనిచేస్తూ ఉండేవాడు పెట్రోల్ పంప్ నుండి పొడుగు స్టాండును శనివారం ఉదయం 11గంటల ప్రాంతం లో ఫంక్షన్ హాల్ కు తీసుకు వెళ్తుండగా పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు