హిందూపురంలో లారీని ఎత్తుకెళ్లిన దుండగులు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ఆటో నగర్ సమీపంలో లారీ చోరీకి గురైన ఘటన చోటు చేసుకుంది. ఆటో నగర్ కాలనీ సమీపంలోని వర్క్ షెడ్ల వద్ద లారీ ఆపి ఉండగా దుండగులు చాకచక్యంగా ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఘటనపై హిందూపురం టూ టౌన్ పోలీసులకు లారీ యజమాని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.