సంతనూతలపాడు లోని రెండవ సచివాలయాన్ని ఎంపీడీవో సురేష్ బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. సచివాలయ సిబ్బంది సకాలంలో విద్యలకు హాజరుకావాలని, విధులకు డుమ్మా కొట్టే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అవినీతికి ఆస్కారం లేకుండా విధులు నిర్వహిస్తూ, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలను పరిగెత్తిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో సూచించారు.