రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం ధర్మవరంలో పర్యటించారు. ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్తో కలిసి ఆయన కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరుతో చెప్పిన సంక్షేమ పథకాలు అన్నిటినీ అమలు పరుస్తోందని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందుకే ఈనెల 10వ తారీకు అనంతపురం గడ్డపై సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసి విజయవంతం చేయాలన్నారు.