అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బెలుగుప్ప తాండ గ్రామంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు మారెమ్మ జాతరలో భాగంగా సిడిమాను ఉత్సవ కార్యక్రమాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుతగా గ్రామంలో గౌరసంద్రం మారెమ్మ ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వద్దకు అర్చకులు చంద్రనాయక్ చేరుకున్నారు. అనంతరం సిడిమానుకు ప్రత్యేక పూజలతో సిడిమానుపై అర్చకుడి ఉండి భక్తులపై పూలు జల్లుతూ ఆశీర్వదించారు. భక్తి పారవశ్య కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి దర్శించుకున్నారు.