అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చనిపోయిన బాయిలర్ కోళ్లు దర్శనమిస్తున్నాయి. మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల దేవరాపల్లి మండలం మారేపల్లి శివారు చేనులపాలెం వద్ద రైవాడ కాలువతోపాటు చెరువుల్లో శనివారం చనిపోయిక కోళ్లు కనిపించాయి. పరిసర ప్రాంతాల్లో పౌల్ట్రీ యజమానులు చనిపోయిన వందలాది కోళ్ళను రాత్రి సమయంలో కాలువల్లో వేసి వెళ్లిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.