శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ కార్యాలయంలో కార్యాలయంలో హిందూపురం గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవలే పద్మభూషణ్ హిందూపురం ఎమ్మెల్యేనందమూరి బాలకృష్ణ గణేష్ నిమర్జనానికి గుడ్డం రంగనాథ స్వామి దేవాలయ కోనేటి సుందరీకరణ చేయాలని నిశ్చయించి దీనికి సంబంధించి కోటి యాభై లక్ష రూపాయలు నిధులను అహుడ ద్వారా విడుదల చేయించారు. అలాగే ఇటీవల ఎమ్మెల్యే బాలయ్య పర్యటనలో భాగంగా గుడ్డం రంగనాథ స్వామి దేవాలయ కోనేటి దగ్గర సుందరీకరణ భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు దీనికి సంబంధించిన ప్లాన్ ని సభ్యులకు వివరించారు.