స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యాలను చేరుకునేందుకు, జిల్లా వృద్ధి రేటు 15 శాతానికి పెంచేందుకు అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశ హాలులో స్వర్ణాంధ్ర విజన్- 2047 లో బాగంగా వివిధ శాఖలు నిర్దేశించిన లక్ష్యాల పై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారానికి అధికారులు కృషి చేయాలన్నారు.