కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం మైలవరం జలాశయం నుండి పెన్నా నదిలోకి నీరు వదిలినప్పుడల్లా మరణాలు సంభవిస్తున్నందున, సంబంధిత అధికారులు ప్రజలు నీటిలోకి దిగకుండా చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు తెలిపారు.సోమవారం మైలవరం.వేపరాల. పెన్నానది పరిసరాల ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్బంగా సిఐటియు కార్యదర్శి దాసరి విజయ్ మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం వేపరాల గ్రామానికి చెందిన ఓ రైతు విద్యుత్ ఘాతుకానికి బలి అయ్యాడని తెలిపారు.. రైతు మరణానికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాలన్నారు.