తమ హక్కుల సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలిపి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులను సోమవారం ముందస్తుగా అరెస్టు చేసి తుర్కపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు భూక్య మోహన్ నాయక్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ హక్కుల సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతుంటే అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామీకం అన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు.