బెల్లంపల్లి సింగరేణి ఏరియా కైరిగూడా ఓపెన్ కాస్ట్ కార్మికులకు చార్జ్ సీట్ ఇవ్వడం సరికాదని హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు రాజబాబు అన్నారు ఈ సందర్భంగా గురువారం కైరిగూడ ఓపెన్ కాస్ట్ మేనేజర్ శంకర్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలిపితే చార్జ్ షీట్ ఇవ్వడం సరికాదని అన్నారు అదేవిధంగా కార్మికులకు ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు