జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు ఆయాల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.18 వేలు అమలు చేయాలని. వేతనాలు నెల మొదటి వారంలో చెల్లించాలని అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఖాళీ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్ బకాయిలు చెల్లించాలని, కేంద్రం అద్దెలు ఆరోగ్య లక్ష్మి బిల్లులు అడ్వాన్సులు ఇవ్వా