చీమకుర్తి: కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమైన సంఘటన చీమకుర్తి మండలం గోనుగుంట - జి ఎల్ పురం గ్రామ సమీపంలోని పొలాల్లో శుక్రవారం వెలుగు చూసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గోనుగుంట - జి ఎల్ పురం గ్రామాల సమీపంలోని పొలాల్లో 30 నుండి 40 సంవత్సరాల వయసు గల పురుష మృతదేహం కుళ్లిన స్థితిలో గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.