Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం మైలారం గ్రామ శివారులోని గుట్టల్లో 187 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ హబ్ లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకురావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఈరోజు(సోమవారం) రెవెన్యూ, ఇండస్ట్రీయల్, పోలీస్ ఇతర శాఖల అధికారులతో కలిసి మైలారం గుట్టపై జరుగుతున్న ఇండస్ట్రియల్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ... మైలారం రెవెన్యూ శివారులోని 204/1 ,205/1 సర్వే నెంబర్ లలో మొత్తం 187 ఎకరాలు భూమి ఉందన్నారు. ప్రభుత్వ భూమి దుర్వినియోగం క