చీమకుర్తి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా పరిషత్ సీఈవో చిరంజీవి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలోని రికార్డులను ఆయన పరిశీలించారు. చీమకుర్తి మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకుని పనులు జరుగుతున్న విధానం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. మండలంలో ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను జెడ్పి సీఈవో చిరంజీవి ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరంగా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు సీజనల్ వ్యాధులు రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.