యూరియాను దిగుమతి చేసుకోకుండా కేంద్రం కొరత సృష్టిస్తోందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఉదయం 10:00 సమయంలో ఏలూరులో ఆయన మాట్లాడారు. సబ్సిడీ తగ్గించుకునేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలో భాగమేదన్నారు. యూరియాపై సబ్సిడీని కుదించి వేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి సరిపడా యూరియా అందించని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని కోరారు. ముఖ్య మంత్రి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తగదని అన్నారు.