పెద్దపంజాణి: మండలంలో వీరప్పల్లి రైతు సేవ కేంద్రంలో కొలతూర్, మరియు పెద్దపంజాణి మండల ప్రధాన కేంద్రంలో రైతు సేవా కేంద్రాలలో యూరియాను రైతులకు అధికారులు ఎలా పంపిణీ చేస్తున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. జిల్లాలో ఇంకా 2 వేల మెట్రిక్ టన్నుల వరకు యూరియా నిల్వలు ఉన్నాయని, ఈ నిల్వలు మరొక రెండు నెలలకు రైతుల అవసరాలకు సరిపోతాయన్నారు. అవసరం అయితే మరిన్ని బస్తాలు జిల్లాకు తెప్పించడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం 45 వేల హెక్టార్లలో పంటలు పండించగా 15 వేల మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ చేశామన్నారు.