నిడదవోలు మండలం సమిశ్రగూడెం కాలువ వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా ఆదివారం సాయంత్రం అపశృతి చోటుచేసుకుంది. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా అది కాలువలో పడిపోయింది. విగ్రహంతో పాటు నిమజ్జనం చేస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. కాలువలో నీరు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది అనే స్థానికులు తెలియజేస్తున్నారు. క్షతకాత్రులను వెంటనే నిడదవోలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.