విశాఖలో సోమవారం నిరసనలతో హోరెత్తింది. ధర్నాలతో దద్దరిల్లింది. తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టరేట్ జీవీఎంసీ వద్ద ధర్నాలు చేశారు. కూటమి ప్రభుత్వం తీరుపై కలెక్టరేట్ సాక్షిగా నిరసనలు హోరెత్తాయి. వివిధ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.ఏపీ యునైటెడ్ గ్రామ వార్డు హెల్త్ సెక్రటరీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో "హెల్త్ సెక్రటరీల" సమస్యలను పరిష్కరించాలని, ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలనీ రీడి ప్లయ్మెంట్ నుండిమినహాయించాలని, చట్టబద్దంగా సెలవులు అమలు చేయాలన్నారు