ఏ క్షణమైనా గాజులదీన్నె ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత కర్నూలు జిల్లాకు జీవనాడిగా ఉన్న గాజులదిన్నె ప్రాజెక్ట్ భారీ వర్షాలతో జలకళ సంతరించుకుంది. మొత్తం సామర్థ్యం 4.5 టీఎంసీల కాగా, ప్రస్తుతం నీటి మట్టం 376.4 మీటర్లకు చేరుకుంది. మరో రెండు మీటర్లు చేరితే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్ట్ డీఈ సుబ్బారాయుడు తెలిపారు. హంద్రీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.