నిజామాబాదు జిల్లా జక్రాన్ పల్లి మండలంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. జక్రాన్ పల్లి మండలం పడకల్ 44 జాతీయ రహదారి దాటుతున్న చిరుతను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్ఐ మాలిక్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిరుతను పంచనామా నిమిత్తం నిజామాబాదు వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.