ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ నగరం లోని మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణా కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ మాట్లాడుతూ వంటింటికే పరిమితం అనుకున్న మహిళలను తమ కాళ్ళ మీద తాము నిలబెట్టేందుకు గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంకల్పించి, మహబూబ్ నగర్ ఫస్ట్ పేరుతో మహిళలకు ఉచితంగా వివిధ కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించడం తో వారికీ వివిధ మార్గాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 1000 మంది మహిళలకు వివిధ రకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇప్ప