అడవులు,వన్య ప్రాణుల సంరక్షణలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులు,సిబ్బంది త్యాగాలు మరువలేనివని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లో డి.ఎఫ్. ఓ కార్యాలయ ఆవరణలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో అటవీ అమరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి విధి నిర్వహణలో అమరువీరులైన అటవీ సిబ్బందికి నివాళులర్పించారు.అటవీ శాఖ అధికారులు, సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా అటవీ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నామని పేర్కొన్