కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వికలాంగులకు రూ.6 వేల పింఛన్ ప్రకటించిందని వెంటనే అమలు చేయాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడుస్తున్న వికలాంగుల పింఛన్ పెంపు హామీ అమలు కావడం లేదన్నారు. ఎన్నికల ముందు వికలాంగుల పెన్షన్ పెంచుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాటతప్పిందన్నారు. వికలాంగులను రూ. 6 వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికుల పెన్షన్ రూ.4 వేలు పెంచాలని డిమాండ్ చేశారు.