వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఈవో రమాదేవి మంగళవారం ఆలయంలోని పలు విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈతనిఖీల్లో భాగంగా సెంట్రల్ గోదాం,లడ్డు ప్రసాద కౌంటర్,ప్రధాన బుకింగ్ కౌంటర్‌తో పాటు కళ్యాణ కట్ట, నూతనంగా ఏర్పాటు చేసిన స్వామివారి నిత్య కళ్యాణం,చండీ హోమం,సత్యనారాయణ వ్రతం నిర్వహించే ప్రదేశాలను మరియు ఆలయ పరిసరాలు పరిశుభ్రతలను జాగ్రత్తగా సమీక్షించారు.గోదాంలోని రికార్డులు,వస్తువులను సమగ్రంగా పరిశీలించిన ఈవో రమాదేవి ఆలయ పరిపాలనా సరళత మరియు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు,మార్గదర్శకాలను సిబ్బందికి సూచించారు