CM రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బుధవారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్షల విషయంలో రేవంత్ రెడ్డి చేతకానితనం బయటపడిందని అన్నారు. విద్యార్ధుల ముందు CM తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. KCR, KTR అరెస్ట్ అవుతారని ప్రచారం చేయడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని విమర్శించారు రేవంత్కు మీడియాలో స్థానం ఉందేమో గానీ ప్రజల్లో లేదన్నారు.