నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండల కేంద్రం నుండి హైదరాబాదుకు బొలెరో వాహనంలో అక్రమంగా నాలుగు గోవులను తరలిస్తుండగా ఆదివారం సాయంత్రం బిజెపి నాయకులు అడ్డుకొని, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, నాలుగు గోవులను మునుగోడు లోని సింగారం గోశాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రవి నాయక్, హుస్సేన్ తదితరులు ఉన్నారు.