ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతానికి చెందిన సీనియర్ జానపద కళాకారులు శుక్రవారం సినారే కళామందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జానపద కళాకారుడు తలారి సురేష్,మిమిక్రీ ఆర్టిస్టు రవితేజ,ప్రముఖ నటుడు మారం ప్రవీణ్ కుమార్ జానపద పాటలను పాడుతూ అందరిని మెప్పించారు. ప్రజా ప్రభుత్వంలో తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వేడుకున్నారు. తమ పరిస్థితి మరీ దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకొని సినారే కళామందిరాన్ని నూతనంగా నిర్మించాలని కోరారు.