ఎమ్మిగనూరు : గోనెగండ్లలో పొట్టేలు దొంగతనం..గోనెగండ్ల శ్రీ చింతలముని స్వామి ద్వారం వద్ద నివసిస్తున్న బైలుప్పలకు చెందిన మాసూం బాషా జీవనాధారంగా పొట్టేల్ పెంపకం చేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు కట్టి ఉంచిన పెద్ద పొట్టేలును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని ఆయన వాపోయాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.