గణేష్ మండపాల నిర్వహణకు ఉత్సవ కమిటీ సభ్యులు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ 🔗 https://policeportal.tspolice.gov.in/ నందు ధరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపాల నిర్వహణ, మండపానికి సంబంధించిన సమాచారం కొరకు మాత్రమేనని,ఈ సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరియు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులభంగా ఉంటుందని పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ గురువారం తెలిపారు.పోలీసు శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని, ఆ తరువాతనే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.