సిరిసిల్ల పట్టణంలో సెప్టెంబర్ 15న జరగబోయే భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా మూడవ మహాసభల ను విజయవంతం చేయాలని భవన నిర్మాణ రంగ సిఐటియు జిల్లా కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను, గత పోరాటాలను సమీక్షించుకొని ఉద్యమ కార్యచరణ రూపొందించుకోవడం జరుగుతుందని వెల్లడించారు. యూనియన్ జిల్లా మూడవ మహాసభలు