తన ప్రేమ విషయంలో తండ్రి మందలించాడని ప్రేమించిన వ్యక్తి తో పాటు మరికొందరితో కలిసి తండ్రిని కాళ్లు చేతులు కట్టేసి చితకబాదిన కూతురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం జెండాల్ తండా గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది, ప్రేమించిన వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్న క్రమంలో తండ్రి ధరావత్ కిషన్ కూతుర్ని మందలించడంతో, ప్రేమించిన వ్యక్తితో పాటు మరికొందరితో కలిసి తండ్రిని తీవ్రంగా కొట్టింది కాళ్లు చేతులు కట్టేసి ఇంట్లో నుండి బయటకు నెట్టేసి వర్షంలోనే రాత్రంతా ఉంచింది, ధరావత్ కిషన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.