*అలుగు పారిన రాయని చెరువు* జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. గ్రామ శివారులోని పెద్దదైన రాయని చెరువు పూర్తి నీటిమట్టం నిండడంతో గురువారం అలుగు పారింది. భారీగా చేరిన వరద నీటితో చెరువు అలుగును చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సీజన్లో చెరువు మొదటిసారిగా అలుగు పారడంతో రైతులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. చెరువు కింద వరి పంటకు సమృద్ధిగా నీరు సమకూరిందని సంతోషాన్ని వెలిబుచ్చారు.