పలమనేర్: పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై లోకేష్ రెడ్డి తెలిపిన సమాచారం మేరకు. జిల్లా ఎస్పీ, డివిజనల్ డి.ఎస్.పి, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు, పాతపేట జయప్ప వీధిలో ఓ మహిళ గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుందని సమాచారంతో పోలీసు సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు. రామకుప్పంకు చెందిన విటుడు సునీల్ కుమార్ 25 తో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్న జ్యోతి 38 అనే మహిళను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాము, ఈమె ఇక్కడే నిర్వహిస్తోందా మరి ఇంకెక్కడైనా బ్రాంచ్ లు పెట్టిందా దీని వెనుక ఎవరెవరున్నారు అనే వివరాలు వెల్లడిస్తామన్నారు.