బాపట్ల జిల్లా కొల్లూరులో మంగళవారం గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులు, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారుల ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఎంతసేపు వేచి చూడాలని రైతులు ప్రశ్నించారు. రైతుకు ఒక్కొక్కరికి ఒక్క యూరియా కట్ట ఇస్తామని అధికారులు చెప్పడంతో వారు నిరాశ చెందారు. రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని రైతులు కోరారు. రైతులకు సరిపడా యూరియా బస్తాలు ఇవ్వాలని కోరారు.