గుత్తి మండలం 44వ జాతీయ రహదారిపై బాట సుంకలమ్మ దేవాలయం సమీపంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిలుచున్న లారీని ఐచర్ వాహనం ఢీకొనింది. ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన లారీ డ్రైవర్ అజయ్, తమిళనాడుకు చెందిన ఐచర్ డ్రైవర్ కుమరేశ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం అనంతపురం రెఫర్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.