హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఆదేశాలతో హిందూపురం రూరల్ మండల పరిధిలోని కిరికేర పంచాయతీలో అధికారులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పల్లె బాట కార్యక్రమం నిర్వహించారు. , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కూడా నియోజకవర్గము గురించి ఆలోచిస్తారని, ప్రజల సంక్షేమం కోసమే పాటుపడతారని పేర్కొన్నారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే అర్జీ ద్వారా మీకు సంబంధిత అధికారులకు సమర్పిస్తే ఆ సమస్యను పది రోజుల్లో సమస్య పరి