పామూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. సమావేశానికి హాజరైన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు తమ గ్రామాల్లోని సమస్యలను ఎంపీపీ గంగసాని లక్ష్మి మరియు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ లక్ష్మీ మాట్లాడుతూ.... ప్రజా ప్రతినిధులు లేవరెత్తిన సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.