గోనెగండ్లలో యూరియా కోసం రైతుల పడిగాపులు..గోనెగండ్లలో యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రోమోర్ సెంటర్ వద్ద పదుల సంఖ్యలో రైతులు తమ పనులు వదిలి వేచి చూస్తున్నారు. వ్యాపారులు యూరియా సరఫరా కోసం లింక్ ఎరువు కొనాలని ఒత్తిడి పెడుతున్నారని రైతులు రహీం, రంగస్వామి వాపోయారు. యూరియా అత్యవసరమని త్వరగా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.